బెంగుళూరులో హత్యకు గురైన సిద్ధార్థ్ కేసులో పురోగతి..సొంత తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర.. కారణాలు ఇలా..
Siddharth Murdere Case: బెంగుళూరులో హత్యకు గురైన సిద్ధార్థ్ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో పోలీసులు
Siddharth Murdere Case: బెంగుళూరులో హత్యకు గురైన సిద్ధార్థ్ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సిద్ధార్థ్ తండ్రి దేవేందర్ సింగ్ రెండో భార్య ఇందూ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తండ్రి దేవేందర్ సింగ్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వినోద్, శ్యాం ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. అయితే ఇందూసింగ్‌తో నిందితుడు శ్యామ్ సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. ఇందూసింగ్ అధిక మొత్తంలో శ్యాంకు డబ్బు ఆశ చూపింది. ఇదే క్రమంలో శ్యామ్ ఖాతాలోకి ఇందూ సింగ్ భారీగా నగదు బదిలీ చేసింది. ఇందులో నుంచి శ్యామ్ రూ.2లక్షలు వినోద్‌కు కేటాయించాడు. అయితే సిద్ధార్థ్ హత్యకు సంబంధించి పోలీసులకు ఆధారాలు దొరకడంతో ఇద్దరు నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉరివేసుకుని శ్యామ్ మృతిచెందగా రైలు కింద పడి వినోద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం వినోద్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
‘స్వచ్చంధ సంస్థ ముసుగులో మోసాలు.. ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు.. ఎట్టకేలకు కటకటాలపాలు