VK Sasikala: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సోమవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఆమె అభిమానులు తమిళనాడు సరిహద్దులకు చేరుకున్నారు. ఆదాయానికి మించిన కేసులో జైలు జీవితం గడిపిన శశికళ ఇటీవలనే విడుదలై బెంగళూరులో కరోనా చికిత్స పొందారు. ఈ క్రమంలో జయలలిత రాజకీయ వారసత్వం కోసం శశికళ.. అధికార పార్టీ అన్నాడీఎంకే మధ్య నడుస్తున్న పోరు ఆసక్తికరంగా మారింది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ చెన్నై ఎంట్రీ తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది.
ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. భారీ కాన్వాయ్‌కి రాష్ట్రంలో అనుమతి లేదని.. కేవలం 5 వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా శశికళ మళ్లీ అన్నాడీఎంకే జెండాతో కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే.. మరికాసేపట్లో శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. చెన్నై నగరంలో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్నమ్మకు నీరాజనం పలికేందుకు కర్ణాటక.. తమిళనాడు సరిహద్దులకు ఆమె అభిమానులు చేరుకున్నారు.
Also Read:
శశికళకు మరో షాక్ ఇచ్చిన తమిళ సర్కార్.. జయలలిత దత్తపుత్రుడు సుదాకరన్ ఆస్తుల జప్తు..