తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెరియార్ నడియాడిన నేలపై బీజేపీ ఎప్పటికీ పాగా వేయలేదన్న డీఎంకే వ్యాఖ్యలు చిత్తవుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఏకంగా పెరియార్ మనవడు సతీష్ కృష్ణనే కమలం గూటికి ఆకర్షితుడయ్యేలా చేసి.. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమనేత పిలిచే పెరియార్ మనవడే కాషాయ గూటికి చేరడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం కూడా ఇటీవల ప్రధాని మోదీని ప్రశంసిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కూడా కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే జరిగితే.. ఇక దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడేందుకు బాటలు పడనున్నాయి.
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా