EPFO Alert: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వడ్డీ జమ.. పూర్తి వివరాలివే.!

|

Aug 12, 2021 | 8:37 AM

పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే చందాదారుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు జమ కానున్నాయి..

EPFO Alert: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వడ్డీ జమ.. పూర్తి వివరాలివే.!
Epfo
Follow us on

పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే చందాదారుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు జమ కానున్నాయి. సుమారు ఆరు కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలోనే వడ్డీని జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక ఖాతాదారుడు అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ఈ విధంగా ట్వీట్ చేసింది.

”ప్రస్తుతం ఈ ప్రక్రియ పైప్ లైన్‌లో ఉంది. త్వరలోనే మీ ఖాతాలో చూపించవచ్చు. వడ్డీ పూర్తిగా జమ కానుంది. ఎలాంటి నష్టం ఉండదు. దయచేసి సహనాన్ని పాటించండి” అని పేర్కొంది.

ఈ నెలాఖరు నాటికీ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ క్రెడిట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పైప్ లైన్‌లో ఉంది. దీనితో వడ్డీ ఈ నెలలో ఏదొక రోజున ఖాతాల్లోకి క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే పీఎఫ్ చందాదారులు తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..

1. మొదటిగా https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింక్‌పై క్లిక్ చేయండి

2. ఆ తర్వాత మీ ఖాతాను ఓపెన్ చేసేందుకు యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ టైప్ చేయండి

3. నెక్స్ట్ స్టెప్‌కు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు