Nirav Modi: నీరవ్‌ మోదీకి షాకిచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. రూ.253 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

|

Jul 22, 2022 | 7:42 PM

Nirav Modi: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) చర్యలు వేగవంతం చేసింది. నీరవ్‌మోదీకి సంబంధించిన..

Nirav Modi: నీరవ్‌ మోదీకి షాకిచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. రూ.253 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం
Nirav Modi
Follow us on

Nirav Modi: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) చర్యలు వేగవంతం చేసింది. నీరవ్‌మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం వెల్లడించింది. ఈ చరాస్తులన్నీ హాంకాంగ్‌లో ఉన్నాయని, మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈడీ వివరాల ప్రకారం.. హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ గ్రూప్‌కు చెందిన కొన్ని ఆస్తులు ప్రైవేట్ ‘వాల్ట్’లలో ఉంచబడిన రత్నాలు, ఆభరణాలుగా గుర్తించినట్లు తెలిపింది. దీంతో పాటు అక్కడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము కూడా గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు.

నీరవ్ ప్రస్తుతం బ్రిటన్‌లోని జైలులో ఉన్నాడు. 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మోదీ ప్రధాన నిందితుడు. దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసును దర్యాప్తు చేస్తోంది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి