ED Officer Arrest: ఓ కేసులో 20లక్షలు డిమాండ్ చేసిన ఈడీ అధికారి.. చివరకు ఏం జరిగిందంటే..

|

Dec 02, 2023 | 8:30 AM

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్‌ లంచం తీసుకున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.

ED Officer Arrest: ఓ కేసులో 20లక్షలు డిమాండ్ చేసిన ఈడీ అధికారి.. చివరకు ఏం జరిగిందంటే..
Ed Officer Arrest
Follow us on

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటూ అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు అంకిత్‌ లంచం తీసుకున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి మనీలాండరింగ్‌ కేసుల్లో కొందరు డీఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. పట్టుబడిన అంకిత్‌ గతంలో ఇంకెవరి దగ్గరైనా ఇలాగే లంచం తీసుకున్నారా అనే కోణంలో తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అంకిత్‌ తివారి నిర్వాకంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూడా కన్నెర్ర చేసినట్లు తెలిసింది. విచారణ జరిపి అంకిత్‌పై చర్యలు తీసుకోవాలని ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తమిళనాడు ఈడీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

తమిళనాడు మంత్రులపై కొరడా ఝులిపిస్తున్న వేళ స్వయంగా ఈడీ అధికారి ఒకరు పట్టుబడటం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..