అయ్యో.. ఎలక్ట్రోలైట్ తాగిన కాసేపటికే వాంతులు..! హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే..

జనాలు ఆరోగ్యంగా భావించి తీసుకునే కొన్ని పదార్థాలు వాళ్ల ప్రాణాలనే తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే యూపీలోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఎనర్జీకోసం చాలా మంది తాగే ఎలక్ట్రోలైట్ తాగి నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎలక్ట్రోలైట్ తాగడం వల్లే వీరంతా ఆస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో.. ఎలక్ట్రోలైట్ తాగిన కాసేపటికే వాంతులు..! హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే..
Kanpur Shocker

Updated on: Dec 08, 2025 | 5:52 PM

జనాలు ఆరోగ్యంగా భావించి తీసుకునే కొన్ని పదార్థాలు, మందులు ఇప్పుడు వాళ్ల ప్రాణాలనే తీస్తున్నాయి. ఇటీవలే దగ్గు మంది తాగి పలువురు చిన్నారులు మృతి చెందగా.. తాజాగా ఎలక్ట్రోలైట్ తాగి మరో చిన్నారి మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన కాన్పూర్‌లోని కాకదేవ్ ప్రాంతంలోని మతైయా పూర్వాలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న అషు రాజ్‌పుత్ అనే వ్యక్తి ప్లేట్, బౌల్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే శనివారం ఉదయం, అతని భార్య మోహిని అనారోగ్యంతో బాధపడుతూ నిరంతరం వాంతులు చేసుకుంటోంది. దీంతో అషు తన భార్యకు ఎలక్ట్రోలైట్ ఇచ్చి ఫ్యాక్టరీకి వెళ్లిపోయాడు.

కాసేపటి తర్వాత మోహిని తన బిడ్డ కృష్ణతో పాటు మేనల్లుడు గగన్‌లకు కూడా ఎలక్ట్రోలైట్ ఇచ్చింది. అయితే అది తాగిన కొద్దిసేపటి తర్వాతే మోహిని, కుమారుడు కృష్ణ , మేనల్లుడు గగన్ కూడా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న భర్త అషు వాళ్లను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ దురదృష్టవ శాత్తు చికిత్స పొందుతూ తన 4 ఏళ్ల కుమారుడు కృష్ణ మరణించాడు. అయితే ఎలక్ట్రోలైట్ సేవించిన తర్వాతే వారి పరిస్థితి విషమించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు తాగిన ఎలక్ట్రోలైట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు.

ప్రస్తుతం, పోలీసులు ఎలక్ట్రోలైట్ ల్యాబ్ నివేదిక, పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు, దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు. ఇక మోహిని, గగన్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం గురించి పరిస్థితిపై వైద్యులు మాట్లాడుతూ.. బాధితులు ఎలక్ట్రోలైట్ సేవించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. కానీ వారి శరీరంలో విషపూరితమైన పదార్థాన్ని గుర్తించినట్టు వైద్యలులు చెబుతున్నారు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ , నివేదికల నుంచి సేకరించిన వివరాల మేరకు అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.