అల్లూరి జిల్లాలోని సీలేరు గుంటవాడ జలాశయంలో మత్స్యకారులకు 22 కేజీల భారీ చేప చిక్కింది. వలలో పడిన ఈ పెద్ద చేపను చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారులు, అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చారు. స్థానికులు దీన్ని దోబీగా పిలుస్తారు. నక్క జ్ఞానేశ్వర్ రావు రూ.4000కు ఈ చేపను కొనుగోలు చేశారు. చేపను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.