Electric Vehicles: వచ్చే రెండేళ్లలో పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

|

Nov 09, 2021 | 6:55 AM

పెరుగుతున్న ఇంధన ధరల నేపధ్యంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఫేమ్ (FAME) పథకం కింద ఈ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్నారు.

Electric Vehicles: వచ్చే రెండేళ్లలో పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!
Nitin Gadkari On Electric Vehicles Price
Follow us on

Electric Vehicles: పెరుగుతున్న ఇంధన ధరల నేపధ్యంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఫేమ్ (FAME) పథకం కింద ఈ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్నారు. అయితే, దీని తర్వాత కూడా వాటి ధర పెట్రోల్.. డీజిల్ వాహనాల కంటే చాలా ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా ఉంటాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. డెన్మార్క్‌లోని ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన వెబ్‌నార్‌లో గడ్కరీ మాట్లాడుతూ పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందువల్ల, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతారు. కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే విధానాలను అవలంబిస్తాయి. దీంతో వారి ఖర్చు కూడా తగ్గుతుంది. రెండేళ్ల తర్వాత అదే ధరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ-వాహనాలపై జీఎస్టీ కేవలం 5% మాత్రమే..

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ కేవలం 5% అయితే పెట్రోల్ వాహనాలపై 48% అని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగించే లిథియం అధిక ధర ఎలక్ట్రిక్ వాహనాల ధరను పెంచింది. అయితే, భవిష్యత్తులో లిథియం అధిక ఉత్పత్తి ధరలను తగ్గిస్తుంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. దేశంలో ఛార్జింగ్ పాయింట్లను సిద్ధం చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెట్రోల్ పంపు ఆవరణలో వీటిని అమర్చేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.
లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో 81% దేశంలో లిథియం బ్యాటరీల ధరను తగ్గించడానికి పని చేస్తోంది. మొత్తం లిథియం బ్యాటరీ అవసరాలలో 81% స్థానికంగా ఉత్పత్తి అవుతోంది. తక్కువ ధరకే బ్యాటరీలను అందుబాటులోకి తీసుకురావడంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. 2030 నాటికి 30% ప్రైవేట్ కార్లు, 70% వాణిజ్య కార్లు అలాగే 40% బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చడం, నిరంతరం ఛార్జింగ్ పాయింట్‌పై పని చేయడం ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం, బజాజ్, హీరో వంటి భారతీయ ద్విచక్ర వాహనాల కంపెనీలు తయారు చేసిన 50% ఇ-వాహనాలు ఎగుమతి చేస్తున్నారు. రానున్న రెండేళ్లలో దేశంలో వేల సంఖ్యలో ఛార్జింగ్ పాయింట్లు నిర్మించనున్నారు. రోడ్డు వెంబడి ఉన్న మార్కెట్ ప్రాంతాల్లో 350 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పెట్రోల్ పంపులు కూడా తమ క్యాంపస్‌లలో ఈ-వెహికల్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివలన వినియోగదారులకు బ్యాటరీ వాహనాలను వాడటంలో ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్‌ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..

Mukesh Ambani’s house: ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్స్‌తో కలకలం!