Electric Scooter Explodes: ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు అకస్మాత్తుగా పేలిపోవడం, కాలిపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులో చోటుచేసుకుంది.

Electric Scooter Explodes: ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..
Electric Scooter Explodes

Updated on: Mar 13, 2023 | 5:56 PM

ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు అకస్మాత్తుగా పేలిపోవడం, కాలిపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే  బెంగళూరులో చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని వలగేరిచల్లి గ్రామంలో ఉంటున్న ముత్తురాజ్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం రూ. 85 వేలు ఖర్చు పెట్టి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‎ని కొన్నాడు. రోజుమాదిరిలాగే ఇవాళ ఉదయం 8:30 గంటలకు స్కూటర్ ఇంట్లో పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టారు. అయితే ఛార్జింగ్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఒక్కసారిగా స్కూటీ పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జి, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్స్ ఇతర వస్తువులన్ని కాలిపోయాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ పేలే సమయానికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. కాని ఆ స్కూటర్ కు దూరంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటీ పేలినప్పుడు పెద్ద ఎత్తున మంటలు రావడంతో దాన్ని నియంత్రించలేకపోయామని ఆ ఇంటి యజమాని ముత్తురాజ్ తెలిపారు. కాని ఎట్టకేలకు తమ కుటుంబ సభ్యులమందరం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు. పేలుడు దాటికి ఇంట్లోని కొన్ని వస్తువులు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.