Tragedy: బిడ్డపై ప్రేమతో ఎలక్ట్రిక్‌ బైక్.. అదే వారి ఉసురు తీసింది.. తండ్రి, కూతురు దుర్మరణం

|

Mar 26, 2022 | 12:14 PM

కూతురి కోసం బైక్‌ కొని రెండ్రోజులు కూడా కాలేదు. కానీ, అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కూతురి కోసం కొన్న ఆ బైకే వారిద్దరి ప్రాణాలు తీసింది.

Tragedy: బిడ్డపై ప్రేమతో ఎలక్ట్రిక్‌ బైక్.. అదే వారి ఉసురు తీసింది.. తండ్రి, కూతురు దుర్మరణం
Electric bike fire in Vellore
Follow us on

కూతురి కోసం బైక్‌ కొని రెండ్రోజులు కూడా కాలేదు. కానీ, అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కూతురి కోసం కొన్న ఆ బైకే వారిద్దరి ప్రాణాలు తీసింది. కూతురికి సౌకర్యంగా ఉంటుందని ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు ఆ తండ్రి. అదే వారి పాలిట యమపాశంగా మారింది. తమిళనాడు(Tamil Nadu)లోని వేలూరు(Vellore)చిన్న అల్లాపురం(Chinna allapuram)లో ఈ విషాదం జరిగింది. పేలుడు సంభవించి తండ్రి, కూతురు మృతిచెందారు. ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాటరీ పేలడంతో ఇళ్లంతా పొగ వ్యాపించి, ఊపిరాడక మృతిచెందారు తండ్రి, కూతురు. బ్యాటరీ ఛార్జింగ్‌లో ఉంచి ఇంట్లో నిద్రిస్తున్నారు కుటుంబసభ్యులు. రెండు రోజుల క్రితమే కూతురు కోసం కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొన్నారు దురై వర్మ. కూతురు ప్రీతీని స్కూల్‌కి తీసుకెళ్లడానికి బైక్ కొన్నారు. కొత్త బైక్ కావడంతో ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టారు. కానీ, బ్యాటరీ పేలి ఇద్దరు మృతిచెందారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్‌లు కాలిపోతున్న ఘటనలు అరుదుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇవి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చాయి కాబట్టి అప్రమత్తత అవసరం. ఎంతసేపు కంటిన్యూగా నడపొచ్చు.. ఎంతసేపు చార్జింగ్ పెట్టవచ్చు అనే అంశాలపై అవగాహన అవసరం.

Also Read: Heat wave: సమ్మర్‌ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.. నిప్పులు చిమ్మనున్న భానుడు

RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం