Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఆ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు కసరత్తు!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది..2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయని 345 పార్టీలను.. రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఆ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు కసరత్తు!
Cec

Updated on: Jun 26, 2025 | 10:27 PM

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది..2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎలాంటి ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను.. రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇలా గత ఆరేళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, ఎన్నికల సంఘం ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ గురువారం తెలిపింది.

ఈ పార్టీలు గత కొంత కాలంగా కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, దేశవ్యాప్తంగా ఎక్కడా తమ కార్యాలయాలను కూడా జరపలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సదరు పార్టీలను రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నా్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 2,800కు పైగా గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ అయ్యి ఉన్నాయని ఈసీ పేర్కొంది. వీటిని తొలగించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఈసీ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..