భారత్‌ వచ్చిన అతిథి..తలదాచుకునేందుకు చోటేది..?

|

Nov 07, 2019 | 3:41 PM

ఆరడుగులు ఉన్న మనిషిని ఆజానుభావుడు అంటారు..మరీ అంతకంటే ఎక్కువ హైట్‌ ఉన్నవారిని ఏమంటారు..? అప్పుడప్పుడు కనిపించే అటువంటి పొడవైనా మనుషులు అందరిని ఆకర్షిస్తుంటారు..అటువంటి వ్యక్తే భారత్‌లోని లక్నోలో ప్రత్యక్షమయ్యాడు. అతని చూసేందుకు యధా మామూలుగానే జనాలు కూడా ఎగబడ్డారు..కానీ, పాపం అతని ఎత్తు అతనికి సమస్యను తెచ్చిపెట్టింది…దేశం కానీ, దేశం నుంచి ఇండియాకు వచ్చిన అతనికి తలదాచుకునేందుకు చోటు దొరక్కా నానా అవస్థలు పడాల్సి వచ్చింది. భారత్‌లోని లక్నోవేదికగా జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ వన్డే క్రికెట్‌ […]

భారత్‌ వచ్చిన అతిథి..తలదాచుకునేందుకు చోటేది..?
Follow us on
ఆరడుగులు ఉన్న మనిషిని ఆజానుభావుడు అంటారు..మరీ అంతకంటే ఎక్కువ హైట్‌ ఉన్నవారిని ఏమంటారు..? అప్పుడప్పుడు కనిపించే అటువంటి పొడవైనా మనుషులు అందరిని ఆకర్షిస్తుంటారు..అటువంటి వ్యక్తే భారత్‌లోని లక్నోలో ప్రత్యక్షమయ్యాడు. అతని చూసేందుకు యధా మామూలుగానే జనాలు కూడా ఎగబడ్డారు..కానీ, పాపం అతని ఎత్తు అతనికి సమస్యను తెచ్చిపెట్టింది…దేశం కానీ, దేశం నుంచి ఇండియాకు వచ్చిన అతనికి తలదాచుకునేందుకు చోటు దొరక్కా నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
భారత్‌లోని లక్నోవేదికగా జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ వన్డే క్రికెట్‌ చూడటానికి ఆఫ్గన్‌ నుంచి వచ్చాడు 8 అడుగుల రెండు అంగుళాల ఎత్తైన షేర్‌ఖాన్‌..నవంబరు 6న మొదలైన ఈ వన్డే మ్యాచ్ ల కోసం అఫ్ఘినిస్తాన్ నుంచి భారత్ కు వచ్చాడు. తలదాచుకునేందుకు అన్నీ హోటళ్లు తిరిగాడు. ఒక్కరు కూడా అతనిని హోటళ్లలో ఉండేందుకు అనుమతించలేదు. ఎత్తుకు భయపడి ఏ హోటల్ ఒప్పుకోకపోవడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాడు షేర్‌ఖాన్‌. నాకా ప్రాంతంలో ఉన్న హటల్ రాజధానికి తీసుకెళ్లి అతనికి ఆశ్రయం ఇప్పించారు. దీంతో మంగళవారం రాత్రి అక్కడ ఉండగలిగాడు.  కాబుల్ నుంచి వచ్చిన వ్యక్తిని చూడటానికి తెల్లవారిన తర్వాత హోటల్ బయట జనాలు భారీగా గుమిగూడారు. దాదాపు 200మంది అక్కడకు రావడంతో అతనికి కాస్త ఇబ్బందికరంగా మారింది. స్థానికుల నుంచి కాపాడేందుకు పోలీసులు ఎస్కాట్ ఏర్పాటు చేసి  ఎకానా స్టేడియంకు తీసుకెళ్లారు. అంతర్జాతీయ వన్డే చూడటానికి వచ్చిన షేర్ ఖాన్ నాలుగైదు రోజులు నగరంలోనే ఉంటారని హోటల్‌ యజమాని తెలిపారు.