Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరోసారి ఈడీ నోటీసులు.. జూన్ 13న విచారణకు రావాలంటూ..

Rahul Gandhi: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు..

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరోసారి ఈడీ నోటీసులు.. జూన్ 13న విచారణకు రావాలంటూ..
Rahul Gandhi

Updated on: Jun 03, 2022 | 11:55 AM

Rahul Gandhi: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీకే ఈ నోటీసులు జారీ చేసిన ఈడీ.. జూన్ 13వ తేదీన విచారణాధికారుల ఎదుట హాజరవ్వాల్సిందిగా పేర్కొన్నారు. కాగా రెండు రోజులు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ జరుపుతున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. విచారణకు హాజరుకావాల్సిందిగా కోరింది. కాగా, ఈ సమన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులకు అణచివేసేందుకే కేంద్రం ఇలా రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తోందని మండిపడుతున్నారు. 2015లోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టడం వెనుక ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్ర ఉందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు.