Delhi Liquor Case: ఈడీ కార్యాలయానికి కనికా రెడ్డి.. ప్రైవేట్ విమానాల ద్వారా డబ్బులు తరలించార నే ఆరోపణలపై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శనివారం ఈడీ విచారణకు కనికారెడ్డి హాజరయ్యారు. జెట్ సెట్ గో కంపెనీ ఎండి గా ఉన్న కనికా రెడ్డి నుంచి ఈడీ అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. జెట్‌సెట్ గోకు సంబంధించిన..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శనివారం ఈడీ విచారణకు కనికారెడ్డి హాజరయ్యారు. జెట్ సెట్ గో కంపెనీ ఎండి గా ఉన్న కనికా రెడ్డి నుంచి ఈడీ అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. జెట్‌సెట్ గోకు సంబంధించిన వివరాలను ఆమె ఈడీకి అందించినట్లుగా సమాచారం. ప్రైవేట్ విమానాల్లో డబ్బులు తరలించారన్న ఆరోపణలపై ఈడీ ఆమెను విచారిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో జెట్ సెట్ గో కంపెనీ పై ఆరోపణలు రావడంతో ఆ సంస్థ ఎండీ కనికా రెడ్డిని విచారణ కోసం పిలిచారు. ప్రైవేట్ విమానాల ద్వారా డబ్బులు తరలించార నే ఆరోపణలు కింద నోటీసులు ఇచ్చారు. దీనికి కనికా రెడ్డి కొన్ని పత్రాలను అందించినట్లుగా సమాచారం. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత లోతుగా విచారిస్తోన్న సంగతి తెలిసిందే.
శరత్ చంద్ర, బినోయ్ కస్టడీని పొడిగించారు. మరో నాలుగురోజులపాటు కస్టడీ పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇదేకేసులో ఇప్పటికే అరెస్టయిన సమీర్ మహేంద్రకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్‌ను పెంచింది. కోర్టు తీర్పుతో ఈ నెల 26వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు. సమీర్ మహేంద్రుని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తీహార్ జైలులో రెండు రోజుల పాటు సమీర్ మహేంద్రును ప్రశ్నించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్‌రామచంద్ర పిళ్లైని సైతం ఈడీ విచారించనుంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈడీ అధికారులు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్ రెడ్డి నిర్వహిస్తున్న జెట్ సెట్ గో సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది.
ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థ సీఈవోగా శరత్ చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. దీంతో దీనిపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఈడీ వివరాలు కోరింది. ఆమెకు చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందిన సర్వీసుల్లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి డబ్బు తరలినట్టు భావిస్తున్నారు. ఆ ఫ్లైట్స్‌లో ప్రయాణించినవారి వివరాలతో పాటు.. వాళ్లు తీసుకెళ్లిన వస్తువుల డీటేల్స్ కూడా ఇవ్వాలంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది.
అత్యవసర ప్రాతిపదికన సమాచారం ఇవ్వాలంటూ గత నెల 17నే ఈడీ కోరగా.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్ ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. కనికారెడ్డి విమానాల్లో పలువురు నేతలు ప్రయాణించినట్టు ఈడీ అనుమానాలు వ్యక్తంచేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం