ajit pawars:మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి చెందిన షుగర్ మిల్స్ జప్తు…ఈడీ.

మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి అయన భార్యకి చెందిన 65 కోట్ల విలువైన షుగర్ మిల్లును, ఇతర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు స్కామ్ తో దీనికి లింక్ ఉన్నట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ మిల్లును అజిత్ పవార్ తో బాటు ఆయన భార్య సునేత్ర అజిత్ పవార్ కూడానా...

ajit pawars:మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్  పవార్ కి చెందిన షుగర్ మిల్స్ జప్తు...ఈడీ.
Ed Attached Ajit Pawars Sugar Mill,mumbai,maharashtra Deputy Cm Ajit Pawar,sugar Mills Ed Attach,wife Sunetra

Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2021 | 9:57 PM

మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి అయన భార్యకి చెందిన 65 కోట్ల విలువైన షుగర్ మిల్లును, ఇతర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు స్కామ్ తో దీనికి లింక్ ఉన్నట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ మిల్లును అజిత్ పవార్ తో బాటు ఆయన భార్య సునేత్ర అజిత్ పవార్ కూడానా నిర్వహిస్తునట్టు అధికారులు వెల్లడించారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో భూమి, బిల్డింగ్, ప్లాంట్, ఇంకా యంత్రాలు ఉన్నాయి.ఇవి మొత్తం 65.75 కోట్ల విలువైనవని..ఇది 2010 నాటి కొనుగోలు ధర అని వారు చెప్పారు. అంటే ఇప్పటి ధరతో పోలిస్తే ఇంకా వందల కోట్ల విలువ గలవైనవిగా కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తులు గురు కమోడిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉండగా వీటిని జరందేశ్వర్ షుగర్ మిల్స్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఈ మిల్స్ కి చెందిన మెజారిటీ షేర్లు అజిత్ పవార్ కి సంబంధించిన స్పార్క్ లింగ్ సాయిల్ కంపెనీలో ఉన్నట్టు ఈడీ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది.

2019 లో ముంబై పోలీసు శాఖ లోని ఆర్ధిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దీన్ని దర్యాప్తు చేసింది. అసలు గురు కమోడిటీ సర్వీసెస్ అన్నది డమ్మీ కంపెనీ అని ఈ సంస్థ పేర్కొంది. దీనిపై ఇంకా విచారిస్తామని అధికారులు తెలిపారు. నిజానికి ఈ షుగర్ మిల్స్, కమ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు స్కామ్ చాలా పాతదని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లకు ఈడీ తన తోలి దశ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎమ్మార్వో గా రవి తేజ..షూటింగ్ షురూ చేసిన మాస్ మహా రాజా Ravi Teja 68 movie video.

ఇండియన్ డిష్ జిలేబి కి ఫుల్ క్రేజ్..వైరల్ అవుతున్న జిలేబి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో :Jalebi Baby song video.

నెమలితో ఆటలాడుతున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్..!వైరల్ అవుతున్న వీడియో :Saina Nehwal feeds Peacock Video.

 ఆదిత్య 369 లా.. కళ్యాణ్ రామ్ బింబిసార..! మూడు పాత్రలలో కనిపించనున్న నందమూరి హీరో :Kalyan Ram Bimbisara Movie.