Election Schedule: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సర్వం సిద్ధం.. కాసేపట్లో షెడ్యూల్ విడుదల

దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధిచిన ఎన్నికల షెడ్యూల్‌లు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

Election Schedule: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సర్వం సిద్ధం.. కాసేపట్లో షెడ్యూల్ విడుదల
Eci To Announce Assembly Election Schedule

Updated on: Mar 15, 2026 | 10:53 AM

దేశంలో మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమయ్యింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయింది. ఇవాళ సాయంత్రంలోపు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేయనుంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం మే-జూన్ మధ్య ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్‌లో నిర్వహించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించింది.

గత కొన్ని వారాలుగా, ఎన్నికల కమిషన్ బృందం ఈ రాష్ట్రాలన్నింటినీ సందర్శించింది. ఫిబ్రవరి నెలలో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో, మార్చి 6-7 తేదీలలో కేరళలో, మార్చి 9-10 తేదీలలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సన్నాహాలను ఈసీ సమీక్షించింది. ఈ సమయంలో, రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారులు, భద్రతా సంస్థలతో సమావేశాలు జరిగాయి. హింసను నిరోధించడం, ఓటర్ల జాబితాలను మెరుగుపరచడం, EVMలు, VVPATలను ధృవీకరించడం, CAPFని మోహరించడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. మీడియా కథనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా మార్పులకు వ్యతిరేకంగా అప్పీళ్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 15తో ముగుస్తుది. ఇక ఇతర రాష్ట్రాల్లో ఈ గడువు ఇప్పటికే ముగిసినందున ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇవాళ ఆదివారం చేయనున్నట్లు సమాచారం

రాష్ట్రాల పదవీకాలం ఎప్పుడు ముగుస్తుంది?

పశ్చిమ బెంగాల్: మే 7, 2026

తమిళనాడు: మే 10, 2026

అస్సాం: మే 20, 2026

కేరళ: మే 23, 2026
.
పుదుచ్చేరి: జూన్ 15, 2026

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us