17మంది తెలుగు ఎంపీలకు ఈసీ షాక్.. ఎన్నిక రద్దు చేస్తామని వార్నింగ్..! రీజన్ ఏంటంటే..?

| Edited By:

Feb 04, 2020 | 5:48 AM

తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరు ఎలక్షన్‌లో గెలిచిన 90రోజుల్లో ఖర్చు వివరాలను […]

17మంది తెలుగు ఎంపీలకు ఈసీ షాక్.. ఎన్నిక రద్దు చేస్తామని వార్నింగ్..! రీజన్ ఏంటంటే..?
Follow us on

తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరు ఎలక్షన్‌లో గెలిచిన 90రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుంటే.. తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అధిక ఖర్చుల విషయ బయటపడుతుందనే భయం ఎంపీల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన అభ్యర్ధులు 45 రోజుల్లో అఫిడవిట్ ఇవ్వాలని.. ఎలక్షన్ వాచ్ కన్వినర్ వీవీ రావు తెలిపారు.