శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం స్వల్ప భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 నమోదైనట్లు పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. లఢక్‌లో కూడా ఈనెల3న స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది.
అలాగే గత గురువారం రాజస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. గురువారం రాత్రి సంభవించిన ఈ భూకంప కేంద్రం రాజస్థాన్‌లో అల్వార్‌లో కేంద్రీకృతమైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. కాగా, జమ్మూలో తాజాగా సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలను గుర్తించిన అధికారులు.. ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.