
బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల‌్‌పై 6.3గా రికార్డయింది. పలు ప్రాంతాలపై భూకంపం ఎఫెక్ట్ పడింది. పోర్ట్ బ్లెయిర్ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత అటు మలేసియా, ఇండోనేసియాల వరకు చూపింది. భూంకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు వచ్చింది.
బంగాళాఖాతంలో 6.82 ఉత్తర అక్షాంశం, 93.37 తూర్పు రేఖాంశం మధ్య అర్ధరాత్రి దాటిన తరువాత సరిగ్గా 12:11 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. అండమాన్ నికోబార్ ఐలండ్ కు నైరుతి దిశగా 63, ఇండొనేసియాలోని బందా ఏక్ కు ఆగ్నేయ దిశగా 42, ఒడిశాకు ఈశాన్య దిక్కున 198 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది.
సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ తన ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు ఉవ్వెతున్న ఎగసిపడ్డాయి. మత్స్యకార గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు.
తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ ప్రచారం జరిగింది. చివరికి అలాంటి హెచ్చరికలేవీ లేకపోవడంతో అంతా లక్షణ్ పూర్, సీతాపూర్, హెన్రీ లారెన్స్ ఐలాండ్స్, మధుబన్ ఆర్వీ, వైపర్ ఐలాండ్స్.. వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అటు ఇండోనేసియాలో బండా ఏక్ వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది.
EQ of M: 6.3, On: 29/07/2025 00:11:50 IST, Lat: 6.82 N, Long: 93.37 E, Depth: 10 Km, Location: Bay of Bengal.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QZdzAeIift— National Center for Seismology (@NCS_Earthquake) July 28, 2025