భూకంపంతో వణికిన ఉత్తర భారతం.. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రకంపనలు

ఉత్తర భారతం మరోసారి భూకంపంతో వణికిపోయింది. గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చంబా, కంగ్రా ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో భూమి కంపించింది.

భూకంపంతో వణికిన ఉత్తర భారతం.. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రకంపనలు

Updated on: Feb 25, 2021 | 7:19 AM

Earthquake Strikes Himachal Pradesh : ఉత్తర భారతం మరోసారి భూకంపంతో వణికిపోయింది. గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చంబా, కంగ్రా ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 3.55 గంటలకు చంబా ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు వెల్లడించారు. దీంతో క్షణాల పాటు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు పేర్కొన్నారు.

కాగా, మరోవైపు, కంగ్రా ప్రాంతంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 2.33గంటలకు భూమి కంపించింది. హిమాచల్ ప్రదేశ్ లో చంబా, కంగ్రా ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. గతంలోనూ హిమాచల్ ప్రదేశ్ లో పలుసార్లు భూమి కంపించింది. స్వల్ప భూకంపాలతో భయపడాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ప్రాణ, అస్థి నష్టానికి సంబంధించిన సమాచారం ఏదీ అందలేదని అధికారులు వెల్లడించారు.