బ్రేకింగ్…మిజోరంను వణికించిన భూ ప్రకంపనలు

|

Jun 23, 2020 | 3:15 PM

ఈశాన్య భారతంను వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లో నిన్న(ఆదివారం) సాయంత్రం 4 గంటలా 16 నిమిషాలకు భూ కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. తాజాగా ఈ ఉదయం (సోమవారం) 4గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయ్యింది. ఛాంపైకి నైరుతి దిశలో 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ గుర్తించింది. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు […]

బ్రేకింగ్...మిజోరంను వణికించిన భూ ప్రకంపనలు
Follow us on

ఈశాన్య భారతంను వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లో నిన్న(ఆదివారం) సాయంత్రం 4 గంటలా 16 నిమిషాలకు భూ కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. తాజాగా ఈ ఉదయం (సోమవారం) 4గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయ్యింది.

ఛాంపైకి నైరుతి దిశలో 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ గుర్తించింది. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు భూమి కంపించింది. ఇలా వరుస భూ ప్రకంపనలు వస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.