Earthquake: మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం!

|

Nov 04, 2021 | 8:07 AM

ఈశాన్య, ఉత్తర భారతం మరోసారి భూకంపంతో వణికిపోయింది. మణిపూర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ తెల్లవారు జామున కంపించినట్లు అధికారులు తెలిపారు.

Earthquake: మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం!
Earthquake
Follow us on

Earthquake: ఈశాన్య, ఉత్తర భారతం మరోసారి భూకంపంతో వణికిపోయింది. మణిపూర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ తెల్లవారు జామున కంపించినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్‌ అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున ఏం జరుగుతుందో అర్ధం కాక జనం భయభ్రాంతులకు గురయ్యారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని ఎన్‌సీఎస్‌ పేర్కొంది. అలాగే, గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6:25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13గంటలకు మరోసారి రిక్టర్‌ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురయ్యారు.

Read Also…  IOC Charging Stations: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఇండియన్ ఆయిన్ కార్పొరేషన్ గుడ్‌న్యూస్.. వ‌చ్చే ఏడాది నాటికి..