రేప్ బాధితురాలి మరణ వాంగ్మూలంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

దేశంలో మహిళల భద్రత, రక్షణపై  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం నూతన అడ్వైజరీని విడుదల చేసింది. అత్యాచారాలకు, లైంగిక దాడులకు గురైన బాధితురాళ్ళ రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని హోమ్ శాఖ ఈ అడ్వైజరీలో సూచించింది. బాధితురాళ్ళు మరణ సమయంలో ఇచ్ఛేవాంగ్మూలాన్ని నిర్లక్ష్యంగా పక్కన పెట్టరాదని కోరింది. ఈ స్టేట్ మెంట్ మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు కాలేదన్న సాకుతో దీన్ని పక్కన పెట్టరాదని,  ఆమె ఏం చెప్పిందన్న దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని […]

రేప్ బాధితురాలి మరణ వాంగ్మూలంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Edited By:

Updated on: Oct 11, 2020 | 4:46 PM

దేశంలో మహిళల భద్రత, రక్షణపై  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం నూతన అడ్వైజరీని విడుదల చేసింది. అత్యాచారాలకు, లైంగిక దాడులకు గురైన బాధితురాళ్ళ రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని హోమ్ శాఖ ఈ అడ్వైజరీలో సూచించింది. బాధితురాళ్ళు మరణ సమయంలో ఇచ్ఛేవాంగ్మూలాన్ని నిర్లక్ష్యంగా పక్కన పెట్టరాదని కోరింది. ఈ స్టేట్ మెంట్ మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు కాలేదన్న సాకుతో దీన్ని పక్కన పెట్టరాదని,  ఆమె ఏం చెప్పిందన్న దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఒక రకంగా హోమ్ శాఖ ఆదేశించింది. అత్యాచార కేసులపై దర్యాప్తు రెండు నెలల్లోగా పూర్తి అయ్యేలా చూడాలని కూడా తన గైడ్ లైన్స్ లో సజెస్ట్ చేసింది.