Ram Leela – Ravan Dahan: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాంలీలా కన్నుల పండువగా జరుగుతోంది. పలుచోట్ల రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయోధ్య , ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో రాంలీలాను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు.
మైసూర్‌లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూర్ ప్యాలెస్ వేదికగా జరుగుతున్న వేడుకలకు రాజకుటుంబంతో పటు సీఎం బస్వరాజ్ బొమ్మై , కర్నాటక మంత్రులు హాజరయ్యారు. జంబూ సవారిపై ఊరేగుతున్నా చాముండేశ్వరి అమ్మవారు. అశ్వదళం ముందు వెళ్తుండగా గజరాజు అభిమన్యు మీద పల్లకి మీద ఊరేగారు అమ్మవారు.
భక్తిశ్రద్దలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 500 మందికే ఈసారి అనుమతి ఇచ్చారు. జంబూ సవారిలో గజరాజు అభిమన్యును అనుసరించాయి మిగతా గజరాజులు.
మైసూర్ చాముండేశ్వరి అమ్మను కొలుస్తూ , భక్తికి సంస్కృతిని జోడిస్తూ శరన్నవరాత్రులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఉత్సవాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. ఈసారి కూడా మైసూర్ దసరా ఉత్సవాలకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. దసరా కోసం మైసూర్ రాజభవనాన్ని అందంగా అలంకరించారు. లైట్లు కాంతుల్లో జిగేలమని మెరుస్తోంది మైసూర్ ప్యాలెస్.