పెళ్లిలో తన భార్యతో డ్యాన్స్ చేశారని ఇద్దరు సోదరులను చంపిన అన్న

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కబీర్ధామ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన భార్యతో అతని సోదరులు నృత్యం చేశారని వారిపై గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కవర్ధ పరిధిలోని బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి కుమారుడి వివాహం రెండు రోజుల క్రితం జరిగింది.

పెళ్లిలో తన భార్యతో డ్యాన్స్ చేశారని ఇద్దరు సోదరులను చంపిన అన్న
Death

Updated on: May 17, 2023 | 12:23 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కబీర్ధామ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన భార్యతో అతని సోదరులు నృత్యం చేశారని వారిపై గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కవర్ధ పరిధిలోని బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి కుమారుడి వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. అయితే సోమవారం రోజున ఈ పెళ్లి సందడిలో కుటుబం సభ్యులు, బంధువులు ఆనందంగా గడిపారు. పెళ్లి మండపంలో నృత్యాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే తిన్హా బైగా భార్య.. అతని సోదరులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమె అలా వారితో డ్యాన్స్ చేయడం తన భర్తకు నచ్చలేదు.

దీంతో ఆ భర్త తన సోదరులపై గొడ్డలితో దాడి చేశాడు. దీన్ని గమనించిన తిన్హా భార్య, అతని పెద్ద సోదరుడు, బావమరిది గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా నిందితుడు విరుచుకుపడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడి ఇద్దరు సోదరుల్ని ఆస్పత్రికి తరలించినప్పటికి వారు మృతి చెందారు. అలాగే అతని భార్య, పెద్ద సోదరుడు, బావమరిది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి అతడ్ని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us