Video: ఫుల్లుగా తాగేసి.. స్కూల్‌లోకి వెళ్లిపోయాడు! ఆపై షర్ట్‌ విప్పేసి.. మహిళా టీచర్లతో..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో స్థానిక పాఠశాలలోకి చొచ్చుకొని వెళ్లి, ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని దుశ్చర్యలను ఓ ఉపాధ్యాయురాలు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సమాజంలో తాగుబోతుల ప్రవర్తనపై చర్చను రేకెత్తిస్తోంది.

Video: ఫుల్లుగా తాగేసి.. స్కూల్‌లోకి వెళ్లిపోయాడు! ఆపై షర్ట్‌ విప్పేసి.. మహిళా టీచర్లతో..
Drunk Man In Up School

Updated on: Mar 17, 2025 | 3:59 PM

కొంతమంది తాగితే ఏం చేస్తారో వాళ్లకే అర్థం కాదు. ఫుల్లుగా మద్యం తాగేసి.. కొంతమంది స్పృహతప్పి పడిపోతే.. మరికొంత మంది తాగిన తర్వాత తమంత పోటుగాడు లేడంటూ.. చిత్రవిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించే క్రమంలో కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఫుల్లుగా తాగేసి ఏకంగా జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్లో చోటు చేసుకుంది. శివ కుమార్‌ అనే వ్యక్తి మద్యం తాగేసి.. సమీపంలోని పాఠశాలకు వెళ్లాడు. పైగా ప్యాంట్‌లో ఒక మద్యం బాటిల్‌ను తోపుకొని.. స్కూల్‌లో హల్చల్‌ చేశాడు. స్కూల్‌ బెంచ్‌పై కూర్చోని మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. మీసాలు తిప్పుతూ.. వీడియోలు తీస్తున్నారా? తీసుకోండి అంటూ బెదిరంచాడు.

అయితే.. అతని చేష్టలన్ని ఓ మహిళా టీచర్‌ ధైర్యంగా సెల్‌ ఫోన్‌లో వీడియో తీశాడు. అలాగే అక్కడే ఉన్న ఓ కుర్రాడు మీరు బయటికి వెళ్లండి అంటూ శివకుమార్‌ అనే వ్యక్తిని గద్దించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. పైగా షర్ట్‌ విప్పేసి.. క్లాస్‌ రూమ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురుగా మహిళా టీచర్లు, విద్యార్థులు ఉన్నారనే ఇంకితం కూడా లేకుండా ప్రవర్తించాడు. మీ డ్యూటీ టైమ్‌ అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ టీచర్లను బెదిరించాడు. ఎంత తాగి ఉన్నా కూడా.. ఇలా చేయడం ఏంటంటూ ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడం, ఈ ఘటనపై టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.