సుశాంత్ కేసు ఇటు తిరిగి, అటు తిరిగి బాలీవుడ్ కి, డ్రగ్స్ కి మధ్య లింక్ కేసుగా మారింది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ రవి కిషన్, సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ మధ్య మొదలైన రచ్చ.. సీన్ లోకి కంగనా రనౌత్ కూడా ఎంటర్ కావడంతో ఈ ఎపిసోడ్ రెండో భాగం మొదలైంది. జయా బచ్ఛన్ పై కంగనా ట్వీట్ల వర్షం కురిపిస్తూ విరుచుకపడితే..తాజాగా ‘రంగీలా’ నటి ఊర్మిళా మటోండ్కర్ సీన్ లో ప్రవేశించింది. కంగనాను టార్గెట్ చేస్తూ.. నువ్వేదో బాధితురాలిగా ‘వుమన్ కార్డ్ ‘ప్లే చేస్తున్నావని, దమ్ముంటే నీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచే డ్రగ్స్ మీద ‘వార్’ మొదలు పెట్టాలని ఛాలెంజ్ చేసింది. అసలు డ్రగ్స్ కి స్వర్గధామం హిమాచల్ అన్న విషయం నీకు తెలుసా అని ఆమె ప్రశ్నించింది. దేశమంతా ఈ మత్తుమందుల సమస్యను ఎదుర్కొంటోందని ఊర్మిళ పేర్కొంది. బడా పన్ను చెల్లింపుదారుల నుంచి వై-కేటగిరీ సెక్యూరిటీ పొందిన ఈ వ్యక్తి.. బాలీవుడ్ కి. డ్రగ్స్ కి మధ్య ఉన్న సంబంధాల గురించి పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని కూడా ఊర్మిళ ‘ఉరిమింది’.
ముంబై తన నగరమని, ఆ సిటీని ఎవరు, ఎలా తప్పు పట్టినా తాను సహించబోనని ‘రంగీలా’రాణి’ హెచ్ఛరించింది. అయితే ముంబైలో కంగనా ఆఫీసు కూల్చివేతను మాత్రం ఆమె ఖండించింది.