Pakistani spy: విదేశీ మంత్రిత్వ శాఖ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపిన పాకిస్తానీ గూఢాచారి.. ముందే గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఆ తర్వాత..

|

Nov 18, 2022 | 4:31 PM

ఏకంగా విదేశీ వ్యవహారల శాఖలో ఉద్యోగులను ముగ్గులోకి దింపుతోంది. హనీ ట్రాప్‌లోకి దింపుతూ ఇక్కడి రహస్యలను విదేశాలకు చేరవేస్తుండగా అడ్డంగా దొరికిపోయింది.

Pakistani spy: విదేశీ మంత్రిత్వ శాఖ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపిన పాకిస్తానీ గూఢాచారి.. ముందే గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఆ తర్వాత..
Pakistani Spy
Follow us on

సరిహద్దుల్లో ఆక్రమణలకు ప్రయత్నించి భంగపడ్డ పాకిస్తాన్.. ఇప్పుడు మనల్ని దొంగ దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. మన రహస్యాలను తెలుసుకునేందుకు.. నిఘా పెట్టింది. ఏకంగా విదేశీ వ్యవహారల శాఖలో ఉద్యోగులను ముగ్గులోకి దింపుతోంది. హనీ ట్రాప్‌లోకి దింపుతూ ఇక్కడి రహస్యలను విదేశాలకు చేరవేస్తుండగా అడ్డంగా దొరికిపోయింది. భారత సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా వర్గాలు ఎప్పటినుంచో ముద్దు గుమ్మలను రంగంలోకి దింపుతున్న సంగతి తెలిసిందే. అయితే అచ్చం ఇలాంటి ప్లాన్‌తో మరోసారి దొరికిపోయింది. తాజాగా పాక్ పన్నాగం. తాజాగా విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ డ్రైవర్‌ పాక్‌ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.

పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన ఓ మహిళతో అతడు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా క్లోజ్ అయ్యింది. ఈ సంగతిని ముందే పసిగట్టాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. దీంతో కొన్ని రోజులుగా అతడిపై నిఘా పెట్టాయి. అతను సైన్యానికి సంబంధించిన కీలక, వ్యూహాత్మక సమాచారాన్ని పాక్ మహిళకు అందించినట్లుగా గుర్తించారు.

గూఢచర్యం ఆరోపణలపై న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పాక్‌కు చెందిన ఓ మహిళ కొన్ని సార్లు పూనమ్ శర్మ పేరుతో మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకుని అతడిని ముగ్గులోకి దింపింది. ఆమె ఇచ్చే డబ్బు కోసం డ్రైవర్ భారత్‌కు చెందిన కీలక సమాచారంతోపాటు కొన్ని పత్రాలను ఇస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.

పెళ్లి చేసుకుందామని అతడిని ఉచ్చులోకి లాగిందని ఓ భారత ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. తన మాయలో పడిపోయాడని నిర్ణయించుకున్నాక, ఆమె అతడి నుంచి కీలక సమాచారం రాబట్టిందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం