బస్సును అడ్డగించిన భారీ ఏనుగు.. 8కిలోమీటర్లు రివర్స్‌లో నడిపిన డ్రైవర్‌..40 మంది ప్రయాణికులు..!

|

Nov 16, 2022 | 10:00 PM

బస్సును తిప్పేందకు స్థలం లేకపోవడంతో అంబలపర నుంచి అనక్కాయం వరకు బస్సును వెనక్కి నడిపి తీసుకొచ్చాడు డ్రైవర్‌.

బస్సును అడ్డగించిన భారీ ఏనుగు.. 8కిలోమీటర్లు రివర్స్‌లో నడిపిన డ్రైవర్‌..40 మంది ప్రయాణికులు..!
Driver Reverses Bus
Follow us on

ఓ ప్రైవేట్ బస్సు కేరళలోని చాలకుడి-వల్పరై రూట్‌లో ప్రయాణిస్తోంది. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు..బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దట్టమైన అడవి గుండా మట్టిరోడ్డులో బస్సు వెళ్తుండగా, ప్రయాణిస్తుండగా.. ఓ ఏనుగు వారి బస్సుకు అడ్డుగా వచ్చింది. గట్టిగా ఘీంకరిస్తూ బస్సుపైకి పరిగెత్తుకొచ్చింది ఆ గజరాజు. ఈ మదగజం బారి నుంచి ప్రయాణికులకు ముప్పును గ్రహించిన డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా బస్సునును వెనక్కి పోనిచ్చాడు.

అసలే అది ఇరుకైన రోడ్డు.. పైగా మట్టి రోడ్డు… అలాంటి రోడ్డుపై బస్సు వెనక్కి వెళ్తున్నకొద్దీ ఏనుగు కూడా దాన్నే వెంబడించింది. బస్సును తిప్పేందకు స్థలం లేకపోవడంతో అంబలపర నుంచి అనక్కాయం వరకు బస్సును వెనక్కి నడిపి తీసుకొచ్చాడు డ్రైవర్‌. ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా బస్సును వెనక్కి నడిపి తీసుకెళ్లిన డ్రైవర్‌ను ప్రయాణికులు అభినందించారు.

ఇలా గంటపాటు 8 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పాచిడెర్మ్‌ అనక్కాయం ప్రాంతంలో ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో బస్సులోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. తమను ఏనుగు ముప్పు నుంచి తప్పించిన వెటిలపరకు చెందిన డ్రైవర్‌ అంబుజాక్షన్‌ను అభినందనల్లో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి