ఎయిర్‌పోర్టులో తచ్చాడుతూ కనిపించిన వ్యక్తులు.. డీఆర్‌ఐ మెరుపు దాడితో బయటపడ్డ కోట్ల విలువైన బంగారం!

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవంతంగా ఛేదించారు. జూన్ 6 శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విమానాశ్రయ పరిసరాల్లో డీఆర్‌ఐ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్లకు పైగా విలువైన అక్రమ బంగారం పట్టుబడింది.

ఎయిర్‌పోర్టులో తచ్చాడుతూ కనిపించిన వ్యక్తులు.. డీఆర్‌ఐ మెరుపు దాడితో బయటపడ్డ కోట్ల విలువైన బంగారం!
Dri Seizes Smuggled Gold

Updated on: Jun 07, 2026 | 5:59 PM

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవంతంగా ఛేదించారు. జూన్ 6 శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విమానాశ్రయ పరిసరాల్లో డీఆర్‌ఐ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్లకు పైగా విలువైన అక్రమ బంగారం పట్టుబడింది. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు విదేశీయులతో పాటు మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

విమానాశ్రయంలోని కొంతమంది సిబ్బంది సహకారంతోనే ఈ నెట్‌వర్క్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులోనే కొంతమంది ఉద్యోగులకు చేరవేస్తున్నట్లు సమాచారం. దీంతో అనుమానితుల కదలికలపై నిఘా ఉంచిన డీఆర్‌ఐ బృందం.. పక్కా ప్లాన్‌తో దాడి చేసి నిందితులను పట్టుకుంది. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అరెస్టయిన ఆరుగురిలో కార్మిక సంఘం నేత కూడా ఉన్నట్లు తెలుస్తుండటం ఈ కేసులో సరికొత్త ట్విస్ట్‌గా మారింది. అతనితో పాటు రోహిత్ కుమార్ సింగ్, సంతోష్ సుభాష్, సమీముల్లా షా, హమీద్ లెబేరిఫ్‌ఖాన్, ఫలిల్ మహ్మద్ ఖాసింలను అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇది దుబాయ్ లేదా ఇతర గల్ఫ్ దేశాల నుంచి ముంబై మీదుగా సాగుతున్న అంతర్జాతీయ స్థాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌గా అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ సిండికేట్ వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు ఉన్నారు? విమానాశ్రయంలో ఇంకా ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉందనే కోణాల్లో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం ఖచ్చితమైన బరువు, ఫోరెన్సిక్ వివరాలతో కూడిన పూర్తి నివేదికను డీఆర్‌ఐ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us