
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు కలాం కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలకు అబ్దుల్ కలాం స్ఫూర్తిగా నిలుస్తారు అని అన్నారు. భారతదేశాన్ని బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైనదిగా మార్చడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. కలాం జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం అని గుర్తు చేసుకున్నారు.
అదే సమయంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. స్వయం-ఆధారిత బలమైన దేశాన్ని నిర్మించాలని కలలు కన్నారని తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మాతృభూమి సేవ కోసం కలాం తన జీవితమంతా అంకితం చేశారని.. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు.
मिसाइल मैन के रूप में विख्यात देश के पूर्व राष्ट्रपति डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर सादर नमन। उन्होंने अपना जीवन भारत को सशक्त, समृद्ध और सामर्थ्यवान बनाने में समर्पित कर दिया। देशवासियों के लिए वे हमेशा प्रेरणास्रोत बने रहेंगे। pic.twitter.com/Pn2tF73Md6
— Narendra Modi (@narendramodi) October 15, 2021
మరో ట్వీట్‌లో, రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయదశమి రోజు దేశ ‘మిస్సైల్ మ్యాన్’ డాక్టర్ ఎపీజే అబ్దుల్ కలాం జన్మదినం రక్షణ రంగానికి చాలా చారిత్రాత్మకమైనది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టిన రోజును ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా’ ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు, విద్యార్థులే భవిష్యత్తు అని విశ్వసించిన మొదటి వ్యక్తి ఆదర్శ ఉపాధ్యాయుడు ఆయన. తమిళనాడులోని రామేశ్వరం నుండి వచ్చిన డాక్టర్ కలాం ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి, ప్రతి తరానికి స్ఫూర్తి , రోల్ మోడల్‌గా నిలిచిపోయారు. అతను గొప్ప విజనరీ నాయకుడు.. కలాం ఎల్లప్పుడూ విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపగలిగారు.
ఇవి కూడా చదవండి: RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..
Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..