Trump – PM Modi: మోదీ చాలా గ్రేట్‌.. ఏ అవసరం వచ్చినా అడగొచ్చు.. ఫోన్‌ కాల్‌తో లైవ్‌లోకి ట్రంప్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. “మోదీ చాలా గ్రేట్.. ఆయనకు నేను పెద్ద అభిమానిని” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో లైవ్ ఫోన్‌కాల్ ద్వారా మాట్లాడిన ట్రంప్.. భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని అన్నారు.

Trump - PM Modi: మోదీ చాలా గ్రేట్‌.. ఏ అవసరం వచ్చినా అడగొచ్చు.. ఫోన్‌ కాల్‌తో లైవ్‌లోకి ట్రంప్‌..
Donald Trump - PM Narendra Modi

Updated on: May 25, 2026 | 7:46 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ చాలా గ్రేట్‌.. ఆయనకు తాను పెద్ద అభిమానిని.. అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ఏది కావాలనుకుంటే.. దానిని సాధించి తీరుతుంది.. అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఢిల్లీలో కలర్‌ఫుల్‌గా జరిగాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఆధ్వర్యంలో ఆ దేశ ఎంబసీ ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో భారత్‌లోని యూఎస్‌ రాయబారి సెర్జియో గోర్‌, అలాగే రుబియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్‌ ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికార్డులు సృష్టిస్తోందన్నారు. ఇక, రూబియో.. అమెరికా చరిత్రలోనే గొప్ప విదేశాంగ కార్యదర్శిగా నిలుస్తారన్నారు ట్రంప్‌.

ఇక, భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు.. తనకు మంచి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. భారత్‌కు ఎప్పుడైనా సహాయం అవసరమైతే.. తనను వందశాతం నమ్మొచ్చన్నారు ట్రంప్‌. భారత్‌కు ఏ అవసరం వచ్చినా.. నేరుగా తనకు కాల్ చేయొచ్చన్నారు అమెరికా ప్రెసిడెంట్‌. ప్రధాని మోదీకి తన తరపున శుభాకాంక్షలు చెప్పాలని.. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్‌ని అంటూ ఫోన్‌కాల్‌ ముగించారు.

ఇదిలాఉంటే.. అమెరికా, భారత్‌లు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు దగ్గరలోనే ఉన్నాయని.. ఇది త్వరలోనే జరుగుతుందని మార్కో రుబియో ఆదివారం వెల్లడించారు. ఈ ఒప్పందంతో ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతకుముందు రుబియో.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us