Viral: పూజ ధ్యాసలో పడిపోయి తీర్థంతోపాటు కృష్ణుడి విగ్రహాన్ని మింగేసిన వ్యక్తి.. కట్ చేస్తే.

|

Jun 24, 2022 | 3:59 PM

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. పూజ ధ్యాసలో మునిగిపోయి తీర్థంతోపాటు బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. ఆ వ్యక్తి గొంతులో ఆ బుల్లి విగ్రహం ఇరుక్కుపోయింది.

Viral: పూజ ధ్యాసలో పడిపోయి తీర్థంతోపాటు కృష్ణుడి విగ్రహాన్ని మింగేసిన వ్యక్తి.. కట్ చేస్తే.
Krishna Idol 1
Follow us on

Karnataka: ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్‌లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. భక్తిపారవశ్యంలో మునిగిపోయి…తీర్థంతోపాటు ఏకంగా బాలకృష్ణుడి విగ్రహాన్నే మింగేశాడు. దీంతో గొంతులో ఆ విగ్రహం ఇరుక్కుపోయింది. డాక్టర్లు అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగుచూసింది. బెళగావి(Belagavi)కి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తికి కృష్ణుడు అంటే విపరీమతమైన భక్తి. ప్రతి పనికి ముందు కృష్ణుడి నామాన్ని జపిస్తూనే ఉంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం బాలకృష్ణుడ్ని విగ్రహాన్ని పూజించేవాడు. అయితే.. ఓరోజు ఊహించని విధంగా తీర్థం తీసుకునేటప్పుడు పంచామృతంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. ఆ సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ ఆ విషయాన్ని అతడు గుర్తించలేదు. రోజులు గడిచిన తర్వాత గొంతులో విపరీతమైన నొప్పి, వాపు రావడంతో భయంతో డాక్టర్ వద్దకు వెళ్లాడు. ఎక్స్‌రే చేసి చూడగా గొంతులో కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని నిర్ధారించారు వైద్యులు. బెళగావిలోని కేఎల్​ఈఎస్​ హాస్పిటల్‌కు అతడ్ని రిఫర్ చేశారు.

ఎండోస్కోపీ టెస్టులు చేసిన అక్కడి డాక్టర్లు.. ఆహార నాళికలో ఎడమవైపు కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా దానిని బయటకు తీయాలని డిసైడయ్యారు. ENT విభాగానికి చెందిన డాక్టర్లు ప్రీతి హజారే, వినీత, చైతన్య కామత్‌తో కూడిన టీమ్ ఆపరేషన్​ చేసి బాలకృష్ణుడి ప్రతిమను తొలగించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

జాతీయ వార్తల కోసం