Doctors protesting: ముదిరిన పీజీ నీట్‌ కౌన్సిలింగ్‌.. పోలీసుల ప్రవర్తనపై రెసిడెంట్‌ డాక్టర్ల ఆగ్రహం

నీట్​- పీజీ 2021 కౌన్సిలింగ్ జాప్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్‌ డాక్టర్లు చేపట్టిన ఆందోళన దేశ వ్యాప్తంగా వైద్య సేవల బంద్‌ పిలుపునకు దారి తీసింది. నిరసన చేపట్టిన డాక్టర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు దురుగా..

Doctors protesting: ముదిరిన పీజీ నీట్‌ కౌన్సిలింగ్‌.. పోలీసుల ప్రవర్తనపై రెసిడెంట్‌ డాక్టర్ల ఆగ్రహం
Neet

Updated on: Dec 28, 2021 | 9:57 PM

Delhi Doctors protesting: నీట్‌- పీజీ 2021 కౌన్సెలింగ్‌ ఆలస్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ రెసిడెంట్‌ డాక్టర్లు చేపట్టిన నిరసనలు నాటకీయ మలుపు తిరిగాయి.. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి నుంచి సుప్రీం కోర్టుకు ప్రదర్శనగా వెళుతున్న డాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, వైద్యులు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో పోలీసుల కొందరు రెసిడెంట్‌ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

రెసిడెంట్ డాక్టర్లతో పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ.. రెసిడెంట్‌ వైద్యుల సంఘం సమాఖ్య ఇవాళ, రేపు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ కూడా 29న ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. డాక్టర్ల ఆందోళన, విధుల బహిష్కరణతో ఢిల్లీలోని ప‌లు ఆస్పత్రుల్లో ఓపీడీ సేవ‌ల‌ను ఆపేశారు. దీంతో భారీ సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఆస్పత్రుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు.

ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే తాను విధులను బహిష్కరించక తప్పడం లేదని రెసిడెంట్ డాక్టర్లు చెబుతున్నారు.. నీట్‌ పీజీలోఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొందరు కోర్టుకు వెళ్లడంతో కౌన్సిలింగ్‌ ప్రక్రియలో ఆలస్యం అవుతోంది. తమ ఇబ్బందులను న్యాయస్ధానానికి చెప్పుకునేందుకు ర్యాలీ చేపట్టగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని డాక్టర్లు తెలిపారు. కాగా తాము డాక్టర్లతో అమర్యాకరంగా ప్రవర్తించలేదని, కేవలం 12 మందిని అదుపులోకి తీసుకొని వదిలేశామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం