Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. సీఎం మమతా రాజీనామా చేయాలంటూ డిమాండ్.!

|

Aug 17, 2024 | 4:07 PM

కోల్‌కతా లేడీ డాక్టర్‌ అత్యాచారం, హత్య వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. పోలీసులు అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. లేడీ డాక్టర్‌ హత్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. సీఎం మమతా రాజీనామా చేయాలంటూ డిమాండ్.!
Kolkata Doctor Case
Follow us on

కోల్‌కతా లేడీ డాక్టర్‌ అత్యాచారం, హత్య వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. పోలీసులు అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. లేడీ డాక్టర్‌ హత్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గ్యాంగ్‌రేప్‌ జరిగిందన్న విషయంపై అవాస్తవమని కోల్‌కతా పోలీసులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో ఈవిషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఘటనపై 24 గంటల విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన IMA – ప్రధానంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల పని పరిస్థితులు, వారి జీవన విధానంపై సమగ్ర పరిశీలన జరిపాలని IMA కోరుతోంది. 36 గంటల డ్యూటీ షిప్ట్‌ విధానం మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది రక్షణ కోసం సెంట్రల్‌ ప్రొటెక్షన్ యాక్ట్‌ అమలు చేయాలని IMA డిమాండ్ చేస్తోంది. హాస్పిటల్‌ ప్రొటెక్షన్‌ బిల్లు 2019లో సవరణలు చేస్తే 25 రాష్ట్రాల్లోని చట్టాలన్నీ బలోపేతమవుతాయన్నది IMA డిమాండ్లలో రెండోది. కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ తరహాలో తీసుకురావడం ప్రస్తుతమున్న పరిస్థితులకు తగినట్టుగా ఉంటుందని IMA అంటోంది. RG కర్‌ ఆస్పత్రిలో ఆగస్టు 14న జరిగిన విధ్వంసంపై నిర్దేశిత గడువు విధించి సునిశిత దర్యాప్తు జరపాలని IMA డిమాండ్ చేస్తోంది.

బాధిత డాక్టరు కుటుంబానికి న్యాయం కల్పించాలని కోరుతోంది. ఎయిర్‌పోర్టు తరహాలో ఆస్పత్రుల్లో సెక్యూరిటీ ఉండాలన్నది IMA నాలుగో డిమాండ్‌. సీసీ కెమెరాల ఏర్పాటు, సెక్యూరిటీ సిబ్బంది మొహరింపు వంటివి జరగాలని కోరుతోంది. తప్పనిసరి సెక్యూరిటీ ఏర్పాట్లతో ఆస్పత్రులను ముందు సేఫ్‌ జోన్‌గా ప్రకటించాలని IMA డిమాండ్ చేస్తోంది. కోల్‌కతా ఘటనలో చనిపోయిన డాక్టర్‌ కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం చెల్లించాలన్నది IMA ఐదో డిమాండ్‌. డాక్టర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. ఆస్పత్రుల్లో డాక్టర్ల భద్రపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చింది. డాక్టర్లు వెంటనే ఆందోళన విరమంచి విధులకు హాజరుకావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.