Constable Harassment: మహిళా పోలీసుపై అధికార పార్టీ యువ నాయకుడి వేధింపులు.. పార్టీ నుంచి సస్పెండ్.. అరెస్ట్..

డీఎంకే సర్వసభ్య సమావేశంలో ఘటన జరిగింది. ఓ వైపు సమావేశం జరుగుతుండగా.. మరోవైపు సభస్థలికి వెనుక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును లైంగికంగా వేధించారు అధికార పార్టీ యువ నేతలు.

Constable Harassment: మహిళా పోలీసుపై అధికార పార్టీ యువ నాయకుడి వేధింపులు.. పార్టీ నుంచి సస్పెండ్.. అరెస్ట్..
Dmk Workers Harass Woman Cop

Updated on: Jan 04, 2023 | 11:42 AM

మహిళా పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఎంకే యువజన కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. డీఎంకే నుంచి సస్పెండ్ అయిన వీరిద్దరినీ మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న చెన్నైలోని విరుగంబాక్కంలో జరిగిన డీఎంకే సర్వసభ్య సమావేశంలో ఘటన జరిగింది. ఓ వైపు సమావేశం జరుగుతుండగా.. మరోవైపు సభస్థలికి వెనుక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును లైంగికంగా వేధించారు అధికార పార్టీ యువ నేతలు. అయితే ఆ మహిళా పోలీసు అధికారిని డీఎంకే యువకులు దుర్భాషలాడారు. పోలీసుల సమక్షంలోనే మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ ఇద్దరు యువకులు మహిళా పోలీసుపై లైంగిక దాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది కాస్తా పెద్ద వివాదంగా మారడంతో ఆ ఇద్దరు యువకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్.

డీఎంకే యూత్ ఎగ్జిక్యూటివ్‌లు ఏకాంబరం, ప్రవీణ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు. అనంతరం అక్కడి నుంచి సాక్షులను కూడా పోలీసులు విచారించారు. మహిళా పోలీసు అధికారిని కూడా విచారించారు. అనంతరం మహిళలపై హింస నిరోధక చట్టం నమోదైంది. రాత్రికి రాత్రే ఇద్దరినీ అరెస్టు చేశారు. పోలీసులు వారి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. డీఎంకే యువ కార్యకర్తలు ఏకాంబరం, ప్రవీణ్‌లను నిన్న రాత్రి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.

వివాదంగా మారిన..

తమిళనాడులో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, అన్నాడీఎంకే డిమాండ్ చేస్తున్నాయి. మహిళ పోలీసును రక్షించడం డీఎంకే పార్టీ విఫలమైందని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే పార్టీ హయాంలో సామాన్య మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న వాస్తవాన్ని ఇలాంటి వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. మనకు రక్షణ కల్పించే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి నెలకొందని, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.

నేరస్తులు వీరే..

డీఎంకే యువకులు ఏకాంబరం, ప్రవీణ్‌లు ఈ నేరంలో పాల్గొన్నట్లు గుర్తించారు. వేదిక వెనుక ఎవరు లేకపోవడంతో అదే అవకాశంగా తీసుకుని మహిళా పోలీసులను వేధించారు. వేదికపై నేతలు ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపైనే అందరూ దృష్టి సారించారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ లేడీ పోలీస్ ఆఫీసర్‌పై దాడి చేశారు. ఈ విషయాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారించారు. అనంతరం డీఎంకే తరపున వారిపై పార్టీ చర్యలు తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం