ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్స్‌ను అందిస్తోంది. అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో జరిగే ఈ అమ్మకాలు డిసెంబర్ 22 నుంచి 25 వరకు కొనసాగుతాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లు మరియు యాక్సెసిరీస్‌పై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి మరియు మరిన్ని బ్రాండ్ల పై డిస్కౌంట్ ఇతర ఆఫర్‌లను పొందవచ్చు. వీటితోపాటు అమెజాన్ నో-కాస్ట్ EMI ఆప్షన్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీలపై 1,500 రాయితీని పొందవచ్చు.
అమెజాన్ వెబ్‌సైట్‌లో అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ రాయితీలో లభించే ఫోన్లు, ఇతర ఉపకరణాల జాబితా ఉంచింది. ఈ ఫోన్లలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8టి, వన్‌ప్లస్ నార్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, రెడ్‌మి 9 ప్రైమ్, మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా పవర్ బ్యాంకులు,హెడ్‌సెట్‌లు, కేసులు, కవర్లు, కేబుల్స్ మరియు ఛార్జర్‌లు కూడా ఉన్నాయి.