
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు పలు దేశాల నేతలు, ప్రతినిధులు, రాజకీయ, సినీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘‘మన ప్రఖ్యాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా, నేను ఈరోజు సంబల్పూర్‌లోని సైనిక్ స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాను.. నా ప్రియమైన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటాను. ప్రధానమంత్రి పుట్టినరోజున నేడు ఒడిశా అంతటా 7.5 మిలియన్ల చెట్లను నాటడం లక్ష్యం… ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు వచ్చి తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस के उपलक्ष्य पर आज सैनिक स्कूल, संबलपुर में वृक्षारोपण अभियान का शुभारंभ किया और प्रिय विद्यार्थियों के साथ मिलकर वृक्ष लगाए।
प्रधानमंत्री जी के जन्मदिवस पर आज पूरे ओडिशा में 75 लाख वृक्ष रोपने का लक्ष्य है। सभी से, विशेषकर… pic.twitter.com/Tl8JIlASqR
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 17, 2025
‘గ్రీన్ సంబల్పూర్, గ్రీన్ ఒడిశా’ అనేది ఒడిశా పౌరుల నుంచి ప్రధానమంత్రికి బహుమతిగా ఉంటుంది. సేవా పర్వ్.. హ్యాపీ బర్త్ డే పీఎం మోదీ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. అంతకుముందు వీడియోలో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అగ్రగ్రామిగా నిలుస్తుందన్నారు..
#HappyBdayPMModi pic.twitter.com/Rt9kX2XRkI
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 17, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..