చైనా కదలికలను పర్యవేక్షించే డివైజ్ కనిపించడంలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ మంత్రి

|

Feb 16, 2021 | 4:22 PM

చైనా కదలికలను పర్యవేక్షించడానికి ప్లూటోనియం ప్యాక్ (డివైజ్) అదృశ్యమైందని ఉత్తరాఖండ్ నీటిపారుదల శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ వెల్లడించారు.

చైనా కదలికలను పర్యవేక్షించే డివైజ్ కనిపించడంలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ మంత్రి
Follow us on

Device Missing : ఉత్తరాఖండ్ రాష్ట్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత నిఘా వ్యవస్థకు సంబంధించి కీలక పరికరం కనిపించడంలేదని తెలిపారు. చైనా కదలికలను పర్యవేక్షించడానికి ప్లూటోనియం ప్యాక్ (డివైజ్) అదృశ్యమైందని ఉత్తరాఖండ్ నీటిపారుదల శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ వెల్లడించారు. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడి వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ డివైస్ కనిపించడం లేదని ఆయన మంగళవారం తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఆయన కోరారు.


దేశ రాజధాని డెహ్రడూన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచు చరియలు విరిగిపడటంపై అనుమానాలు ఉన్నాయన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉండవచ్చన్నారు. ఈ విషయమై కేంద్ర చొరవ తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అలాగే, మంచు చరియలు విరిగిన రోజు నుంచి చైనాను పర్యేవక్షించే డివైజ్ కనిపించడం లేదు. దీనిపై కూడా విచారన చేపట్టాలని సత్పాల్ మహారాజ్ డిమాండ్ చేశారు. అవసరమైతే సాటిలైట్ చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ఇదీ చదవండి… మధ్యప్రదేశ్‌లో అమానుషం.. ఓ గిరిజన మహిళపై యువకుడిని కూర్చొబెట్టి ఊరేగించిన స్థానికులు