హెగ్డే చెప్పిందంతా అబధ్ధం..’ డ్రామా ‘ ప్రసక్తే లేదన్న ఫడ్నవీస్

| Edited By: Srinu

Dec 02, 2019 | 4:22 PM

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. తన సొంత పార్టీకే చెందిన ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ఓ ప్రకటనను ఖండించారు. తమ పార్టీ సహచరుడైన ఫడ్నవీస్ తనకు మెజారిటీ లేకున్నా .. శివసేన నేతృత్వంలోని కూటమి రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపారని, అందువల్లే ఆయనను మహారాష్ట్ర సీఎంగా చేశారని హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే […]

హెగ్డే చెప్పిందంతా అబధ్ధం.. డ్రామా  ప్రసక్తే లేదన్న ఫడ్నవీస్
Follow us on

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. తన సొంత పార్టీకే చెందిన ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ఓ ప్రకటనను ఖండించారు. తమ పార్టీ సహచరుడైన ఫడ్నవీస్ తనకు మెజారిటీ లేకున్నా .. శివసేన నేతృత్వంలోని కూటమి రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపారని, అందువల్లే ఆయనను మహారాష్ట్ర సీఎంగా చేశారని హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది పూర్తిగా తప్పు అని, తాత్కాలిక ముఖ్యమంత్రిగా అలాంటి నిర్ణయమేదీ తాను తీసుకోలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అసలు ఏ సొమ్మునూ నేను కేంద్రానికి తిప్పి పంపలేదు అని వివరించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విషయంలో మా ప్రభుత్వానికి భూ సేకరణ తప్ప మరెలాంటి పాత్రా లేదని కూడా ఆయన చెప్పారు. కేంద్రం ఎలాంటి నిధులనూ కోరలేదని, పైగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగాన్ని నివారించేందుకు బీజేపీ ‘ డ్రామా ‘ ఆడిందని హెగ్డే చేసిన వ్యాఖ్యలను కూడా ఫడ్నవీస్ సన్నిహిత వర్గాలు రబ్బిష్ అంటూ కొట్టి పారేశాయి. వాట్సాప్ లో సర్క్యులర్ అయిన మెసేజ్ లను చూసి హెగ్డే అలా అని ఉంటారని పేర్కొన్నాయి. ఫడ్నవీస్ సీఎంగా ఉన్న ఆ కొద్ధి సమయంలో రైతులకు ఆర్ధిక సాయం చేసేందుకు నిధులను విడుదల చేయాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నారని ఈ వర్గాలు స్పష్టం చేశాయి.