మనిషిని సాటి మనిషి గాలిపీలుస్తున్నంత ఈజీగా అత్యంత పాశవికంగా చంపేస్తున్నాడు.. ఇప్పటికే దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు మరవక ముందే.. మళ్ళీ దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఆ మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచారు. ఈ హత్య విషయం నవంబర్ 27న అంటే సోమవారం వెల్లడైంది. దీంతో నిందితులైన మహిళ పూనమ్ , ఆమె కుమారుడు దీపక్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్త అంజన్ దాస్.. తన పిల్లలతో తప్పుగా నడుచుకునేవాడని.. అందుకనే తాను తన భర్తను చంపాల్సి వచ్చిందని.. అయితే అంజన్ దాస్ ను పొడిచి చంపింది తాను కాదని తన కొడుకు అని నిందితురాలైన మహిళ పేర్కొంది.
ఈ దారుణ హత్య పాండవ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడ నివాసముంటున్న మధ్య వయస్కుడైన అంజన్ దాస్ తన సవతి కొడుకు దీపక్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం దీపక్ కు తెలిసింది. కోపంతో కోపోద్రిక్తుడైన దీపక్ తన తల్లి పూనమ్‌తో కలిసి.. అంజన్‌దాస్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. చాకచక్యంగా మత్తు మాత్రలు ఇచ్చి తండ్రిని అపస్మారక స్థితికి చేర్చి, ఆ తర్వాత మే 30న హత్యకు పాల్పడ్డాడు.
#WATCH वह (मृतक अंजन दास) मेरे बच्चों के साथ गलत करता था और गलत नीयत रखता था इसलिए मैंने ऐसा किया और मैंने नहीं मेरे बेटे ने उसे चाकू मारा: आरोपी पूनम, दिल्ली#DelhTrilokpuriMurderCase pic.twitter.com/nEzYTStdGZ
— ANI_HindiNews (@AHindinews) November 28, 2022
4 రోజులు ఫ్రిజ్ లో మృతదేహం:
హత్య చేసిన అనంతరం అంజన్‌దాస్ మృతదేహాన్ని పారవేయడం కోసం 10 ముక్కలుగా కట్ చేశారు. ఆ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టి భద్రపరిచారు. ముక్కలను పడవేయడానికి అవకాశం కోసం చూశారు. ఆ ముక్కలను వివిధ బ్యాగ్స్ లో పెట్టి మూడు నాలుగు రోజుల పాటు తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా విసిరివేశారు. అంజన్‌దాస్ పుర్రెను పాతిపెట్టారు. అయితే కళ్యాణ్‌పూర్‌లోని రాంలీలా మైదాన్‌లో బ్యాగ్‌లో ఒక ముక్క కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాస్ తన సవతి కూతురు, సవతి కొడుకు భార్యపై చెడు దృష్టిని కలిగి ఉన్నాడని అనుమానిస్తున్నట్లు విచారణలో నిందితులు ఇద్దరూ చెప్పారు. అతడి మృతదేహం ముక్కలను ఉంచేందుకు ఉపయోగించిన రిఫ్రిజిరేటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాస్ శరీర భాగాలు దొరికిన తర్వాత పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని 302 (హత్య) 201 (సాక్ష్యాలను చెరిపివేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..