
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 20 ఏళ్ల నుంచి మెట్రో రవాణా సదుపాయం ఉంది. అయితే ఇప్పుడు ఢిల్లీ మెట్రో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక నుంచి తమ మెట్రోల్లో పరిమిత స్థాయిల్లో మద్యం బాటిళ్లను కూడా తీసుకెళ్లొచ్చని తెలిపింది. అలాగే ఆ బాటిళ్లకు సీలు ఉండాలి. అవి కూడా రెండు బాటిళ్లకి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. మరో ముఖ్య విషయం ఏంటంటే రైళ్లలో గాని ప్రయాణ ప్రాంగణంలో గాని మద్యం సేవించడం నిషేధమని వెల్లడించింది. వాస్తవానికి మెట్రో రైళ్లలో ఆల్కహాల్ బాటిళ్లు తీసుకెళ్లడం చాలాకాలంగా నిషేధం ఉంది. ఇటవలే రైళ్లలో నిషేధిత వస్తవుల జాబితాకు సంబంధించి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే ఢిల్లీ మెట్రో యాజనాన్యం సమీక్ష చేశాయి.
అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఓ ప్రయాణికుడు సీలు ఉన్నటువంటి రెండు మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతిచ్చాయి. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్ నిబంధనలకు అనుగుణంగానే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై ట్విట్టర్‌లో వినియోగదారులు స్పందించారు. మిగత లైన్లలోను మద్యం బాటిళ్లను తీసుకెళ్లుందుకు అనుమతిస్తారా అని ప్రశ్నించారు. అయితే దీనికి కూడా ఢిల్లీ మెట్రో రైలు అవును అని క్లారిటీ ఇచ్చింది. అలాగే మెట్రోలో ప్రయాణించేటప్పుడు సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలని చెప్పింది. ఒకవేళ మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.