Delhi Lawyer filed case: ఆ కంపెనీలను మూసేయాలంటూ.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు దిల్లీ లాయర్ ఫిర్యాదు..

Delhi Lawyer filed case: దిల్లీకి చెందిన ఓ లాయర్ హ్యుందాయ్, కేఎఫ్ సి, పిజ్జా హట్, కియా సంస్థల భారత విభాగాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Delhi Lawyer filed case: ఆ కంపెనీలను మూసేయాలంటూ.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు దిల్లీ లాయర్ ఫిర్యాదు..
Delhi Lawer Complaint

Updated on: Feb 10, 2022 | 6:20 PM

Delhi Lawyer filed case: దిల్లీకి చెందిన ఓ లాయర్ హ్యుందాయ్, కేఎఫ్ సి, పిజ్జా హట్, కియా సంస్థల భారత విభాగాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలను రెజిస్ట్రేషన్ రద్దు చేయాలని.. ఆ సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. వారు ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని లాయర్ వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాలంలో ఇప్పటికే తీవ్రస్థాయిలో వ్యతిరేకత మెుదలైందని వివరించారు. ఈ కంపెనీ దేశంలో వారి వ్యాపారాలు కొనసాగకుండా నిలువరించాలన్నారు. ఐపీసీ, ఐటి చట్టంలోని 121A, 153, 153a, 504, 505 సెక్షన్ల కింద చర్యలు చేపట్టాలని కోరారు.

పాకిస్థాన్ కు అనుకూలంగా.. భారత్ పై వివాదాస్పద వ్యాఖలు చేసిన బహుళజాతి కంపెనీలు పాకిస్థాన్ లోని తమ వ్యాపార అవసరాల కోసం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని అంతర్జాల వేదికల్లో చూసిన లక్షల మంది తీవ్రంగా మండిపడుతున్నారన్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా భారత్ పాక్ ల మధ్య కశ్మీర్ వివాదం నడుస్తోందని.. అది ఒక సున్నితమైన అంశమని అన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రపంచానికి తెలుసునని గుర్తుచేశారు. ఈ వివాదం వల్ల రెండు దేశాల మధ్య రాన్ను కాలంలో వివాదం చెలరేగే ప్రమాదం ఉందని అన్నారు.

ప్రస్తుతం ట్విట్టర్ విధికగా కంపెనీలు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను రెట్టగొట్టేవిధంగా, దేశంలో ఘర్షణ వాతారవణాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని వివరించారు. దీనివల్ల శాంతి, స్నేహభావం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. హ్యుందాయ్ సంస్థ సామాజిక మాధ్యమాల్లో కశ్మీర్ విషయంపై పోస్టులు చేయగానే సియోల్​లోని భారత రాయబారి.. ఆ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. సోమవారం భారత విదేశాంగ శాఖ.. దక్షిణ కొరియా రాయబారికి సమన్లు కూడా పంపింది.

ఇవీ చదవండి…

Imran Khan China Trip: పాపం ఇమ్రాన్.. బీజింగ్‌లో బకరా అయిన పాక్ ప్రధాని.. ఆ ఫోటో ఒక్కటే మహాభాగ్యం అంటూ సెటైర్లు.

Hyundai Tweets: కశ్మీర్ విషయంపై వివాదంగా మారిన ఆ కంపెనీల ట్వీట్లు.. దక్షిణ కొరియా అంబాసిడర్ కు భారత్ సమన్లు..