ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి నో బెయిల్

|

Nov 15, 2019 | 4:25 PM

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2007 లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల ఓవర్ సీస్ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే […]

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి నో బెయిల్
Follow us on

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2007 లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల ఓవర్ సీస్ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే అంటే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసింది. అటు-చిదంబరం జ్యూడిషియల్ కస్టడీని ఢిల్లీ లోని స్పెషల్ కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది.