ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నగరంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా తను హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు అయన ట్వీట్ చేశారు. ఆయనకు ఇవాళ కరోనా టెస్ట్ నిర్వహించనున్నారు. నిన్ననే సత్యేంద్ర జైన్.. హోం మంత్రి అమిత్ షా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. తనకు గతరాత్రి జ్వరం వచ్చిందని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో హాస్పిటల్ లో చేరానని ఆయన పేర్కొన్నారు. కాగా గతవారం కేజ్రీవాల్ కూడా ఇలాగే జ్వరం, గొంతు నొప్పితో బాధ పడ్డారు. ఆయనకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అటు. తన సహచర మంత్రి త్వరగా కోలుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Due to high grade fever and a sudden drop of my oxygen levels last night I have been admitted to RGSSH. Will keep everyone updated
— Satyendar Jain (@SatyendarJain) June 16, 2020