దేశ రాజధానిలో బారికేడ్లను లెక్క చేయని రైతు సంఘాలు.. ఉద్రిక్తతంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ

|

Jan 26, 2021 | 2:08 PM

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది

దేశ రాజధానిలో బారికేడ్లను లెక్క చేయని రైతు సంఘాలు.. ఉద్రిక్తతంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ
Follow us on

Farmers tractors Protest : అనుకున్నదే జరిగింది.. పోలీసుల ముందస్తు హెచ్చరికలు చేసిన ఫలితం లేకుండా పోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులో కదం తొక్కారు. ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని దాటి ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను నిలువరించే క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయినా.. పోలీసుల అడ్డు గోడలను దాటుకుంటూ రైతులు ఢిల్లీ వైపు దూసుకువస్తున్నారు.

రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8గంట‌ల‌ నుంచే ఆందోళన మొదలుపెట్టారు. స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డు చెప్పడంతో సింఘు, టిక్రీ సరిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పాండ‌వ్ న‌గ‌ర్ ద‌గ్గర్లో ఢిల్లీ, మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వేపై బారికేడ్లను రైతులు తొల‌గించారు. ముక‌ర్బా చౌక్‌లో పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంజ‌య్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లో పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులకు స్థానికులు పూలతో స్వాగతం పలుకుతున్నారు. కొన్నిచోట్ల ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీ వైపు రాకుండా బస్సులను అడ్డంగా పెట్టారు. దీంతో రైతులు వాటిని ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Read Also… హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత, ప్రయాణికుల ఇబ్బందులు