Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఐదు రోజుల పాటు విచారించేందుకు కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. అయితే మూడు రోజుల పాటే కస్టడీకి అనుమతిస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది.. తిరిగి ఈనెల 29వ తేదీన కేజ్రీవాల్‌ను తిరిగి కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టనుంది. ఉదయం కేజ్రీవాల్‌ను తిహార్ జైలు నుంచి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే తనపై సీబీఐ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా మనీష్ సిసోడియా పేరును తాను విచారణ తెలిపినట్టు ప్రచారం చేశారని, కాని ఇది నిజం కాదన్నారు. తనతో పాటు సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కేసులో నిర్ధోషులమని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాం కుట్ర గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని అందుకే కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 43 కోట్ల హవాలా మనీని ఆప్ ఉపయోగించిందని, లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బు తోనే అక్కడ ఖర్చు చేశారని సీబీఐ ఆరోపించింది. విజయ్ నాయర్ , ఆతిషి , సౌరభ్ భరద్వాజ్ లాంటి నేతలు లిక్కర్ స్కాం అంతా మనీష్ సిసోడియాకే తెలుసని అంటున్నారని, దీనిపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసిన కేజ్రీవాల్ సీబీఐ కేసుతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోసారి సమగ్ర సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..