Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురుగాలి… అగ్రనేతలందరూ వెనుకంజలోనే..

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. అదే సమయంలో ఆప్ అగ్రనేతలందరూ వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీశ్ సిసోడియా తదితరులపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురుగాలి... అగ్రనేతలందరూ వెనుకంజలోనే..
Delhi Election Results

Updated on: Feb 08, 2025 | 9:44 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికాసం స్పష్టంగా కనిపిస్తోంది. న్యూఢిల్లీ సెగ్మెంట్‌లో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి ప్రవేశ్‌వర్మ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. కాగా తొలిరౌండ్‌లో 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్‌. ఓట్ల లెక్కింపు మొదలైన గంట తర్వాత కూడా ఆయన వెనుకంజలోనే ఉండడం గమనార్హం. కేజ్రీవాల్‌ మీద బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ లీడింగ్‌ లో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇక కాల్కాజీలో ఫస్ట్‌ రౌండ్‌ ట్రెండ్స్‌ విషయానికి వస్తే.. ఈ సెగ్మెంట్ లో సీఎం ఆతిశి కన్నా రమేష్‌ బిధూరి 673 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా మూడోస్థానంలో ఉన్నారు. ఢిల్లీలో తెలుగువాళ్లున్న స్థానాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. చంద్రబాబు ప్రచారం చేసిన షహదరాలోనూ బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది.

ఇక ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 36 దాటింది బీజేపీ. సుమారు 26 ఏళ్ల తర్వాత కాషాయపార్టీ ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. బాద్‌లీ, దేవ్‌లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ లీడింగ్‌ లో ఉండగా, ముస్లిం ప్రాబల్య సెగ్మెంట్‌ ఓక్లాలో ఆప్‌ బాగా వెనుకంజంలో ఉంది. ఓట్‌ షేరింగ్‌లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీకి సుమారు 52శాతం ఓట్లు పడగా, ఆమ్‌ఆద్మీకి 43శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం 4శాతం కూడా దాటలేదు.

ఆప్‌, కాంగ్రెస్‌ని ఆదరించని ముస్లింలు

కాగా మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటోంది. అందరూ కాషాయం వైపు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఆప్‌పై వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసొచ్చాయని తెలుస్తోంది.ఢిల్లీలోని ముస్లిం సీట్లలో బీజేపీకి ఆధిక్యం వస్తోంది. 12 స్థానాల్లో 7 చోట్ల బీజేపీకి స్పష్టమైన లీడ్‌ వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కోసం ఈ కింది వీడియోను చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..