దేశ రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

|

Sep 13, 2020 | 10:42 AM

దేశరాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దయాళ్‌పూర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు

దేశ రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
Follow us on

దేశరాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దయాళ్‌పూర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఉదంతంతో స్థానికంగా తీవ్రకలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అబ్దుల్లా హమీద్(47), ఫారూక్(45)గా గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో గాయపడిన జోజఫ్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, రెండు గ్యాంగుల మధ్య జరిగిన కాల్పులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ వారికోసం సీసీ ఫుటేజీల అధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, శనివారం అర్థరాత్రి దుండగులు బైక్‌పై వచ్చి ముగ్గరు వ్యక్తులపై పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుండగులు మూంగా నగర్‌లో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. అలాగే అక్కడికి సమీపంలోని నెహ్రూ విహార్‌లో మరొక వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు తెలిపిన వివరాలు భిన్నంగా ఉన్నాయి. కాగా, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలోని సీటీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు తెగబడ్డవారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.